calender_icon.png 14 February, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోటార్ సైకిల్ దొంగల అరెస్టు

14-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తున్న దొంగలను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పట్టణంలోని సుభాష్నగర్ కు చెందిన వాస తిరుపతి గత అక్టోబర్ 4న మధ్యాహ్నం తన తోటి ఉద్యోగిని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించడానికి వెళ్లి తన మోటార్ సైకిల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపాడు.

తన స్నేహితుడిని ట్రైన్ ఎక్కించి తిరిగి వచ్చి చూసేసరికి తన మోటార్ సైకిల్ లేదు, దీంతో తన మోటార్ సైకిల్ ను గుర్తు తెలియని దొంగలు దొంగిలించినట్లు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణలో భాగంగా సీఐ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పకడ్బందీగా నిఘా పెట్టి విస్తృత తనిఖీలు చేశారు. గురువారం అపోల్ రీ హాస్పిటల్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా మెట్ పల్లికి చెందిన షేక్ మదర్(27), పవన్ కుమార్ (35)లు దొంగిలించిన మో టార్ సైకిల్‌తో సహా మరో మోటార్ సైకిల్ దొంగతనం చేయుటకు రైల్వే స్టేషన్‌కు వస్తూ పోలీసులకు దొరికారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ తెలిపారు.