13-03-2025 11:33:32 PM
భీమదేవరపల్లి,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వేలేరు లో పెట్రోలింగ్ చేస్తుండగా మోటార్ సైకిల్ దొంగను అరెస్టు చేసినట్లు వేలేరు పోలీసులు వెల్లడించారు. ఈనెల 9వ తేదీన వేలేరు శివారులో పుట్ట సుదర్శన్ తన వ్యవసాయ వద్ద పనులు చేస్తుండగా హుజురాబాద్ కు చెందిన గోవిందుల కుమారస్వామి సుదర్శన్ కు చెందిన మోటార్ సైకిల్ తో సహా రెండు వేల ఐదు వందల రూపాయల నగదు తో పాటు సెల్ఫోన్ ఎత్తుకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. గురువారం వేలేరులో పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న గోవిందుల కుమారస్వామిని అరెస్టు చేసి ఆయన వద్ద నుండి మోటార్ సైకిల్ తో పాటు సెల్ఫోన్ నగదు రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.