04-03-2025 08:27:34 PM
భద్రాచలం (విజయక్రాంతి): నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టియుకు చెందిన పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం పట్ల భద్రాచలం పట్టణంలో మంగళవారం సాయంత్రం పి ఆర్ టి యు శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద విజయోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు బి శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పిఆర్టియు అని తమ అభ్యర్థిని గెలిపించిన ఉపాధ్యాయులందరికీ ఆకృతజ్ఞతలు తెలియజేశారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నుండి ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్లో ముగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ విజయోత్సవ నినాదాలు చేశారు.