కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రతి ఒకరు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలనిమోటార్ వాహన తనిఖీ అధికారి మహేష్‌కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శాంతినికేతన్ పాఠశాల, కామారెడ్డి జడ్పీ హెచ్‌ఎస్ మాచారెడ్డి పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒకరు రోడ్డు నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. హెల్మెట్ అనేది మానవుడికి రక్షలాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో వాహన తనిఖీ అధికారి నాగలక్ష్మీ, రాజనీబాయి, సురేష్, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్సోర్ట్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.