26-03-2025 06:28:31 PM
ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): మార్చి 28న ఇల్లెందులో జరుగు ఐఎఫ్టియు అనుబంధ మోటార్ యూనియన్ల విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు, తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.రాసుద్దీన్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఇల్లెందు సిహెచ్పి లో కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో, బస్టాండ్ సెంటర్లో ఆటో కార్మికులతో ఏర్పాటు చేసిన ప్రచార మీటింగ్ లలో వారు పాల్గొని మాట్లాడారు.
మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 2019 మోటార్ వెహికల్ చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం ఆటో కార్మికులకు12వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, ఆటో మోటార్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డి.మోహన్ రావు నాయకులు మోరె వెంకటేశ్వర్లు, పి.రమేష్, విజయ్, బాలు, రాజు, ప్రశాంత్, వినోద్, భానోత్ రాజు, బి.శ్రీను, మేఘ్య, సాదిక్, నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.