calender_icon.png 16 April, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ ప్రారంభం

16-04-2025 12:38:23 AM

  1. అక్రమంగా మోటార్ వినియోగాన్ని నియంత్రించేందుకు జలమండలి చర్యలు
  2. మాదాపూర్‌లో పర్యటించిన ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15(విజయక్రాంతి) : నగరంలో నీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి అధికారులు ‘మోటార్ ఫ్రీ టాప్‘ డ్రైవ్‌ను మంగళవారం ప్రారంభించారు. పలువురు వినియోగదారులు నల్లాలకు అక్రమంగా మోటార్‌లను బిగించి నీటిని లాగుతున్నందున దాన్ని నియంత్రించేందుకు జలమం డలి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. జలమండలి పరిధిలో లోప్రెజర్ ఉన్న ప్రాంతాలు, మోటార్ల వాడకం ఎక్కువగా ఉన్న కాలనీలలో చేపట్టిన  ప్రత్యేక డ్రైవ్‌లో బాగంగా జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది పలు ప్రాంతాల్లో పర్యటించారు.

విజిలెన్స్, స్థానిక అధికారులతో కలిసి మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ లో నీటి సరఫరా సమయంలో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న మోటార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ దాదాపు 150 కిలో మీటర్ల నుంచి నగర పౌరులకు జలమండలి నీటిని సరఫరా చేస్తోందని.. వెయ్యి లీటర్ల నీటిని శుద్ధి చెయ్యడానికి రూ. 50 వరకు ఖర్చు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.

అలాంటి నీటిని మొక్కలకు, ఫ్లోర్, వాహనాలను కడగడానికి వినియోగించకూడదని సూచించారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగం టిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. రానున్నరోజులలో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని గార్డెనింగ్, నిర్మాణం తదితర అవసారకు వృధా చేయకూడని విజ్ఞప్తి చేసారు.

నల్లలకు మోటార్లు బిగించి నీటిని తోడితే  మిగితా వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీటి సరఫరా కావడంతో వారు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. వారి అవరాలకు నీరు సరిపోక ట్యాం కర్ బుక్ చేస్తున్నారని.. దీంతో ట్యాంకర్ డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. అందు కే ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. జలమండలి పరిధిలోని అన్ని డివిజన్ ప్రాంతా ల్లో నిర్వహిస్తామని.. ఈడీ డైరెక్టర్ నుంచి కిందిస్థాయి లైన్‌మెన్ వరకు పాల్గొని అక్రమ మోటార్లు ను సీజ్ చేసి నీటి వృధా అరికట్టాలని సూచించారు.   

64 మోటార్లు సీజ్..84 మంది వినియోగదారులకు అక్రమంగా మోటార్లు

జలమండలి చేపట్టిన మోటార్ ఫ్రీ డ్రైవ్‌లో భాగంగా పలు చోట్ల జలమండలి పైపులైనుకు అపార్ట్ మెంట్ వాసులు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్నట్లు గుర్తించి విజిలెన్స్ సిబ్బంది మోటార్లు సీజ్ చేశారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ లో మొదటి రోజు మంగళవారం అన్ని డివిజన్ లలో కలిపి మొత్తం 64 మోటార్లను సీజ్ చేశారు.

84 మంది వినియోగదారులకు అక్రమంగా మోటార్లు ఉపయోగించినందుకు, నీటి వృధా చేసినందుకు పెనాల్టీ విధించారు. ఓ అండ్ ఎమ్ డివిజన్  ఎస్‌ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు సీజ్ చేసి వినియోగదారులకు పెనాల్టీ వేశారు. నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్ర దించాలని, జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.