19-03-2025 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
ప్రేరణ అనేది డబ్బు కావచ్చు. మెప్పు కావచ్చు. పదోన్నతి కావచ్చు. అవసరాలను అడగకుండానే తీర్చడం కావచ్చు. కొత్త అవకాశాలను ఇవ్వడం కావచ్చు. ఇలా వివిధ రకాల ప్రేరణలు వ్యక్తులను లక్ష్యం వైపు కొత్త శక్తితో నడిపిస్తాయి.
అనుగ్రహ పరిహారౌచైభ్యః
కోశవృద్ధికరౌ దద్యాత్
కోశోపఘాతకౌ వర్జయేత్.
- కౌటిలీయం (2-17)
వ్యవసాయం చేసేవారికి రాజు తన కోశానికి వృద్ధిని కలిగించే అనుగ్రహ, పరిహారాలను ఇస్తూ ఉండాలి. నష్టపోకున్నా వ్యావసాయికుల అభివృద్ధికై సహాయ పడ డం అనుగ్రహం. కాగా, నష్టాలను పూడ్చుకునేందుకు ఇచ్చేది పరిహారం. వ్యవసా యం వల్ల పౌరులకు ఆహారం లభిస్తుంది. ఉత్పత్తి పెరిగితే రైతుకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా సంపద సృష్టి జరుగుతుంది.
రైతులు, కార్మికులు, వ్యాపారులు అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి ముందుకు నడిస్తేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుంది. అందరూ సరైన పనిని, సరిగ్గా చేయడం వల్ల అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందుతాయి. ఈ ప్రక్రియలో ఎవరి పాత్రను వారు సమర్థవంతంగా పోషించడంలో ప్రేరణ అన్నది కీలక పాత్రను పోషిస్తుంది.
ఊహాతీతంగా ప్రకృతి వైపరీత్యాల బారిన పడే రైతులకు, ప్రమాదకరమైన కార్యాలను నిర్వహించే వ్యక్తులకు, మిలిటరీ, పోలీస్ ఉద్యోగులకు ఎలాంటి ప్రేరణను కలిగిస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయనేది వారివారి వ్యక్తిగతమైందే కాక సమయ సందర్భాలపైనా ఆధారపడి ఉం టుంది. అంతేకాదు, వ్యక్తుల మానసిక పరిస్థితి సైతం దీనికి కారణమవుతుంది.
నకా రాత్మక వైఖరి కలిగిన వ్యక్తులకు ఎలాంటి శిక్షణను, ప్రేరణ ఇచ్చినా వారి వైఖరి మారక పోవచ్చు. కాబట్టి, ఉద్యోగుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆల స్యం చేయడం, వారి వైఖరి సరిగా లేకు న్నా, అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం వారిలో కొరవడినా ఉద్యోగాల నుంచి తొలగించడానికి వేగంగా స్పందించగలగాలి.
నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి అవసరమైన విజ్ఞానాన్ని, శిక్షణనూ ఇవ్వవచ్చు. కానీ, వారి మొత్తంగానే వైఖరి నకా రాత్మకమైతే వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. అలాంటి ఉద్యోగులు లేకపో తేనే సంస్థకూ లాభం ఉంటుంది. ఉద్యోగి తన అభిరుచికి అనువైన వృత్తినే ఎన్నుకోవాలి.
నిరుద్యోగత అధికంగా ఉన్న సమయంలో చిన్న ఉద్యోగాలకు అవసరమైన దానికన్నా అధికమైన విద్యార్హతలు కలిగిన వ్యక్తులు పోటీ పడవచ్చు. దాంతో నాణ్యత గలిగిన ఉద్యోగుల ఎంపిక చాలా క్లిష్టతరమవుతుంది. చిన్న ఉద్యోగాలకు పెద్ద విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే కాలక్రమంలో తమ స్థాయికది చిన్నదనే భావనతో వారికి పనిలో ప్రేరణ కరువవుతుంది.
ఏ ఉద్యోగానికి అయితే తాము ఎంపిక చేయబడ్డారో అది తమకు గర్వకారణమని మనసావాచా కర్మణా భావించే వారు త మ పదవికి న్యాయం చేస్తారు. ఈ భావనే వారికి ప్రేరణనిస్తుంది. ఇలాంటి వారికి అందించే శిక్షణ కావలసిన మేర నైపుణ్యాలనూ పెంచుతుంది. అప్పు డు అది వ్యక్తిగతంగా వారికీ ఉపయుక్తమవుతుంది. సంస్థకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. వైఖరికి తోడుగా క్రమశిక్షణ ఉద్యోగుల ఎంపికలో ప్రధానమైంది.
నిజానికి వైఖరి, క్రమశిక్షణ రెండూ జీవితమనే నదీ ప్రవాహానికి రెండు దరుల వంటివి. అవి సరిగా ఉంటే నదీ ప్రవాహం గమ్యం చేరుతుంది. యువతలో సాహసకృత్యాలపై ఆసక్తి ఉం టుంది. జీవనగమ్యంపై అవగాహనా ఉం టుంది. సాధించాలనే తపనతోనూ ఉం టారు. అలాంటి వారు నేర్చుకునేందుకు సన్నద్ధమవుతారు. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా ఆరోగ్యంగా ఉండి ఉత్సాహంగా పనిచేయగలరు.
ఇలాంటి యువతరాన్ని విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఆయా ఉద్యోగా లకు ఎంపిక చేసుకొని, అవసరమైన శిక్షణను ఇస్తే వారి శక్తి సామర్థ్యాలు పూర్తిగా సంస్థకు ఉపయుక్తమవుతాయి. స్పష్టమైన లక్ష్యాలను, పరిధులను, పరిమితులను నిర్ణయించి అవసరమైన శిక్షణతోపాటు వన రులను వారికి అంది స్తే ఉత్తమ ఫలితాలు ఆవిష్కారమవుతాయి. ఈ ప్రక్రియలో అనునిత్యం అందించే ప్రేరణయే ఒక పెద్ద ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
వ్యక్తిత్వ పరిణతితోనే ఉమ్మడి లక్ష్యాల సాధన
ప్రేరణ అనేది డబ్బు కావచ్చు. మెప్పు కావచ్చు. పదోన్నతి కావచ్చు. అవసరాల ను అడగకుండానే తీర్చడం కావచ్చు. కొత్త అవకాశాలను ఇవ్వడం కావచ్చు. ఇలా వివిధ రకాల ప్రేరణలు వ్యక్తులను లక్ష్యం వైపు కొత్త శక్తితో నడిపిస్తాయి. అదే బృం దాలుగా చూసినప్పుడు ఒకరిపై ఒకరు ఆధారపడే విధానం ఉండాలి. అప్పుడే సాధారణమైన ప్రేరణ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది.
ఒక బస్సు కోసమో, రైలు కోసమో ఎదురుచూస్తున్న ప్రయాణీకుల బృందానికి ఉమ్మడి లక్ష్యం బస్సు లేదా రైలును ఎక్కడమే. కాని, అది రాగానే ఉమ్మడి లక్ష్యం వ్యక్తిగత అవసరంగా మా రుతుంది. ఒకరిపై ఒకరు ఆధారపడే విధా నం లోపిస్తుంది. సమూహంలోని ప్రతి వ్యక్తీ నిర్దేశిత లక్ష్యం తమదిగా భావించి పరస్పర సహకారంతో ముందుకు సాగాలనే భావనను పెంచుకునేలా ప్రేరణను అందివ్వడం యాజమాన్యాలకు ఒక రకంగా కత్తిమీద సాము వంటిదే.
బృందం లేదా వ్యక్తులు సాధించిన ఫలితాలను గుర్తించడం, అభినందించడం, అవసరమైన మార్గదర్శనం చేయడం, తప్పుచేసిన వారిని శిక్షించడంపై కాక తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి దానిని సరి చేయడం, వ్యక్తులమధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిచడం, కిందిస్థాయి ఉద్యోగులైనా ఉన్నతమైన ఆలోచనలను ప్రకటిస్తే వారికి అవకాశాన్ని ఇవ్వ డం, ఇంకా నిబద్ధత కలిగిన వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వంటివి మంచి ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.
ఉదాత్త లక్ష్యాన్ని చూపి దానిని వారెం త శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తున్నారో గమనించాలి. ఈ తరహా ప్రత్యేక ప్రోత్సహకాల వల్ల వ్యక్తిగత పరిణతికి అవకాశం ఏర్పడుతుంది. ఈ తరహా వ్యక్తులు బృం దాలుగా కూడా సమున్నత ఫలితాలను సాధించగలరు. యాజమాన్యంలో అయోమయం ఉంటే ఉద్యోగులలో కూడా ఆ మేరకు స్పష్టత లోపిస్తుంది. ప్రాధాన్యతా క్రమాన్ని గుర్తించలేరు.
అలాంటి యాజమాన్యం ఉద్యోగులకు కాలానుగుణ ప్రేర ణను అందించలేదు. ఉత్సాహవంతమైన యాజమాన్యం తమ ఆచరణ ద్వారా అనుచరుల కు మార్గదర్శన చేస్తూ, అన్ని విధాలుగా ప్రేరణను ఇవ్వడం వల్ల వ్యక్తులుగా ఉద్యోగులూ తాము ఎదుగుతూ, సంస్థ ప్రగతిని పరుగులు పెట్టిస్తా రు. ఇది ఇరువురికీ శ్రేయోదాయకం.