calender_icon.png 14 January, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మోతీమాత జాతర

14-01-2025 01:49:47 AM

  • జాతర ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చిన బంజారా 
  • అమ్మవారిని దర్శించుకున్న  మాజీ  మంత్రి హరీష్ రావు 

సంగారెడ్డి, జనవరి 13: మరిగమ్మ మోతిమాత జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం మొగుడంపల్లి మండలంలోని ఉప్పరపల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఉత్సవాలను బంజారా లు ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది బంజారాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మోతిమాత అమ్మ వారిని దర్శించుకుంటే తమ సమస్యలను పరిష్కారం అవుతాయని బంజారాల నమ్మకం.

దీంతో ప్రతి ఏడాది మోతిమాత జాతర ఉత్సవాలు భారీ ఎత్తున బంజా రాలను నిర్వహిస్తారు. ఈ జాతర ఉత్సవాలకు గిరిజన తండాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వంటలు చేసుకుని అక్కడే ఉంటారు. బంజారాలు తమ కుటుంబంతో బంధువులను పిలుచుకొని దేవాలయం చుట్టుపక్కల వంటలు చేసుకొని భోజనాలు చేస్తారు. అమ్మవారికి మేకలు, కోళ్లు బలి ఇచ్చి మొక్కలు తీర్చుకుంటారు.

అమ్మవారి దర్శనం కోసం గిరిజనులు గంటల తరబడి క్యూ లైన్‌లో ఉండి దర్శించుకుని వెళుతుంటారు. దేవాలయం ఆవరణలో ఉన్న పంచ వృక్షానికి కంకణాలు కట్టి తమ సమస్యలు తీరాలని మొక్కుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు అక్కడ కంకణాలు కడితే పిల్లలు తొందరగా పుడతారని బంజారాలను నమ్మకం. దీంతో బంజారా లు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పంచ వృక్షాలకు కంకణాలు కడతారు. బంజారా లు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. 

అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు 

మోతిమాత జాతర ఉత్సవాలను రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ నిర్వాహకులు మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. జాతర ఉత్సవాలను మాజీ మంత్రి పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

దేవాలయం కు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వ హాయాల్లో కృషి చేశామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తమ ప్రభుత్వం తిరిగి వస్తుందని తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు, చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 

మోతిమాత అమ్మవారిని దర్శించుకు నేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. దేవాలయం చుట్టూ పార్కింగ్లో ఏర్పాటుచేసి వాహనాలను పార్కింగ్‌లోనే నిలిపేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో కాలినడకన భక్తులు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పోలీసు సైతం ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేసేం దుకు పలు చర్యలు తీసుకున్నారు. జాతర ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమైంది జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్ది, జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.