calender_icon.png 19 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతీలాల్ మృతదేహం లభ్యం

03-09-2024 12:15:40 AM

హనుమకొండ, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): మరిపెడ మండలం ఆకేరువాగులో గల్లంతైన నూనావత్ మోతీలాల్ మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆదివారం ఉదయం కూతురు అశ్వినితో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా కారుతో సహా ఆకేరు వాగు వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం అశ్విని మృతదేహం లభ్యమవగా తండ్రి మోతీలాల్ మృతదేహం కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం మోతీలాల్ మృతదేహాన్ని గుర్తించారు. అదే విధంగా కారును సైతం బయటకు తీశారు.