calender_icon.png 12 January, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రారంభమైన మోతిమాత జాతర ఉత్సవాలు

12-01-2025 04:05:05 PM

జహీరాబాద్,(విజయక్రాంతి): పోతిమాత జాతర ఉత్సవాలు బంజారాలు సంప్రదాయ ప్రకారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం బంజారాలో వారి వారి సంప్రదాయం ప్రకారం మోతీమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. దేవాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి అమ్మవారికి తీపి నైవేద్యం సమర్పించారు. దేవాలయం చుట్టూ ఉన్న బంజారా తండాలకి చెందిన మహిళలు యువకులు భారీ సంఖ్యలో భాజా భజంత్రీలతో ఆటపాటలతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పలు తాండలకు చెందిన మహిళలు వారి సాంప్రదాయ దుస్తులతో దేవాలయం కు చేరుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, అధికారులు పాల్గొన్నారు.