భాషలు నిర్వీర్యమైతే సాంస్కృతిక వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాదు, అవకాశాలు, సంప్రదాయా లు, జ్ఞాపకశక్తి, ప్రత్యేకమైన ఆలోచనా విధా నం, వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్ధారించడానికి విలువైన వనరులు కూడా నశించి పోతాయి. ప్రపంచంలోని మొత్తం 6 వేల భాషల్లో 43 శాతం ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. కేవలం కొన్ని భాషలకు మాత్రమే విద్య వ్యవస్థలో చోటుదక్కితే, అతి కొద్ది వాటిని మాత్రమే డిజిటల్ ప్రపంచంలో వినియోగిస్తున్నారు.
సాహిత్య వారసత్వ సంపదకు జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహ దం చేస్తుంది. అటువంటి మాతృభాషను అపురూపంగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సామాన్యులు కూడా మాతృ భాషలోనే భావవ్యక్తీకరణ ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారనేది సత్యం. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష.
ప్రపంచీకరణ పుణ్యమా అని ఇప్పుడు ఇంగ్లీషుదే ఆధిపత్యంగా మారింది. చదువుకోవాలంటే ఇంగ్లీషు, ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీషు, ఆఖరికి బయటకు వెళ్లి వ్యవహారాలు నడపాలంటే ఇంగ్లీషు... ఇలా ఎక్కడ చూసినా ఇంగ్లీషుదే పెత్తనం అయిపోయిం ది. ఈ పరిస్థితికి ఎదురొడ్డి మనం మనుగడ సాగించడం కష్టమే! అలాగని మన మాతృభాష అయిన తెలుగుని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి రావడమే విచారకరం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఆంగ్లం అవసరమే. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది.
అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే పర భాషల్ని నేర్చుకో వడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో తెలిపింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నట్లే, ఆగస్ట్ 29న వ్యావహారిక భాషా పితామ హుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది.తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహి స్తుంది. ప్రతి ఏటా ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలి.
మాతృభాషలో చదువుకున్నవారికి ఉద్యోగ అవకా శాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల తరహా తెలుగు రాష్ట్రాలు కూడా మాతృభాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన విద్యా విధానం కూడా మాతృభాషకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగు భాషకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించింది. ఇందుకు కొన్ని నిధులను కూడా కేటాయించింది. ఇటువంటి నిధులను సద్వినియోగం చేసుకుని తెలుగు భాషా వికాసానికి పాలకులు కృషి చేయాలి.
యం.రాం ప్రదీప్