26-04-2025 07:32:04 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): బుడిబుడి నడకలు వేస్తూ వచ్చిరాని మాటలతో అప్పుడే ఓనమాలను పలికిస్తూ ఆలన పాలన చూస్తూ పిల్లలను తీర్చిదిద్దే ప్రతి ఒక అంగన్వాడి సెంటర్ అమ్మ వడిలాంటిదేనని అంగన్వాడి టీచర్ రుక్మిణి అన్నారు. శనివారం మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో అంగన్వాడి సెంటర్లో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ టీచర్ రుక్మిణి మాట్లాడుతూ... సెంటరులో ఈ.సి.సి.ఈ డే నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా పిల్లలకు ఆట పాటతో పాటు చక్కటి విద్యను చెప్పడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తల్లులు పాల్గొని వారి పిల్లల పట్ల అంగన్వాడి సేవల తోటి చాలా అభివృద్ధిలో ఉంటున్నారని ఎంతో సంతోషించారు. పిల్లలకు వారి అభివృద్ది కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్లో చదువుకున్న ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు సర్టిఫికెట్ ఇచ్చి పిల్లలను సంసిద్ధం చెయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆయా బాలమణి తదితరులు పాల్గొన్నారు.