calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల తల్లికి అండగా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్

19-04-2025 07:00:07 PM

నిరుపేద విద్యార్థిని చదువు కోసం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా 22 వేలు ఆర్థిక సహాయం...

భద్రాచలం (విజయక్రాంతి): అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని సెట్టి సింధుకి బాగా చదువుకోవాలన్న ఆకాంక్ష తపన ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగోలేక చదువు కష్టంగా మారింది. తల్లిదండ్రులు రోజు కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తూ, ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో విద్యార్థి యొక్క చదువు కష్టంగా మారడంతో పేద విద్యార్థి చదువు కోసం మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ను ఆశ్రయించగా ట్రస్టు సభ్యులు దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా  నిరుపేద విద్యార్థిని బిఎస్సి నర్సింగ్ చదువు కోసం 22 వేల రూపాయలు అందజేయడం జరిగినది.

ఈ సందర్భంగా ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న పేద విద్యార్థినికి నేనున్నానంటూ ముందుకు వచ్చి విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సహాయం అందించిన ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. అలాగే విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ట్రస్టు నిర్వాహకులు అందిస్తున్న ఆర్థిక సహకారంతో ఇష్టంతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల. మురళి మాట్లాడుతూ పేద విద్యార్థినికి చదువుకోవాలని తపన ఆకాంక్ష ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ట్రస్ట్ సభ్యులు సహకారంతో పేద విద్యార్థినికి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు. విశాఖ దానికి సహకరించిన ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు చోళ ఇన్సూరెన్స్ మేనేజర్ బాలరాజు, సాయికుమార్, కోమటిరెడ్డి చైతన్య, జయరాం, నాగరాజు  బూరం నవీన్, ఎడ్విన్ కిషోర్, మహమ్మద్ సింధా, జాబిల్లి హాస్పిటల్ నిర్వాహకులు ఫణి తదితరులు పాల్గొన్నారు.