- టీచర్ వృత్తిని వీడి..ఆకలి తీర్చే అమ్మగా మారి
- గణపవరంలో ఘనంగా 114వ జయంతి వేడుక
- చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రంథాలయ చైర్మన్
కోదాడ,(విజయ క్రాంతి): అభాగ్యుల పాలిట దైవం, మానవతామూర్తి మదర్ థెరిసా 114వ జయంతి వేడుకలను సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గ్రంథాలయ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వర్లు ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... యుగోస్లేవియలో 1910 ఆగస్టు 26న మదర్ థెరిస్సా జన్మించింది.
ఇండియా చేరుకొని సేవా కార్యక్రమాలతో అన్నార్దుల ఆకలి తీర్చే అమ్మగా మారారు. కోల్ కత్తా మురికి వాడల్లో పేదల దుస్థితి చూసి చలించిపోయారు. 1937లో టీచర్ వృత్తిని వీడి విరాళాలతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1962లో పద్మశ్రీ,1969లో అంతర్జాతీయ జవహర్ లాల్ నెహ్రూ అవార్డు,1980లో భారతరత్న అవార్డు అందుకుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.