మహబూబ్ నగర్: నిరుపేదలు, అభాగ్యులకు మదర్ థెరిసా అందించిన సేవలను మరువలేమని డీసీసి సీనియర్ నాయకులు సీజే బెనహర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లిలో మదర్ థెరిసా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెనహర్ మాట్లాడుతూ... సేవకు ప్రతిరూపం మదర్ థెరీసా అని కొనియాడారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవలు చేసి ప్రపంచంలోనే గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారన్నారు. ఆమె తన జీవితాన్ని నిరుపేదల కోసం త్యాగం చేశారు. మదర్ థెరీసాను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఫాదర్ ఆల్లం మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.