27-03-2025 01:36:07 AM
వర్ణ వివక్షపై కేరళ సీఎస్ బహిరంగ లేఖ
తిరువనంతపురం, మార్చి 26: అనేక విషయాల్లో వివక్ష ఎదురవడం మనం గమనిస్తున్నాం. ఓ సీఎస్ స్థా యిలో ఉన్న వ్యక్తికి రంగు విషయంలో వివక్ష ఎదురు కావడం ఎవరూ ఊహించి ఉండరు. కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ నల్లగా ఉన్నారని పలువురు కామెంట్స్ చేశారట. స్వయంగా సీఎస్‌యే ఈ విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా తన బాధను కూడా వ్యక్తం చేశారు. ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు.
‘నా భర్త తర్వాత నేను కేరళ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించా. నా చర్మ రంగుపై సోషల్ మీడియాలో రకరకాల కామెం ట్స్ వచ్చాయి. నేను మొదట్లో ఈ కామెంట్స్ చూసి కాస్త కంగారుపడ్డా. నలుపును ఎందుకు అవమానించాలి. ఇది విశ్వమంతా వ్యాపించి ఉంది.
4 ఏళ్ల వయసులో తనను గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా మళ్లీ తీసుకురాగలవా అని మా అమ్మను అడిగా’. అని వివరించారు. శారదా మాటలపై స్పందించిన కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్.. ‘ఆమె చెప్పిన ప్రతిమాట నా హృదయాన్ని తాకింది. నా తల్లి కూడా నల్లటి రంగును కలిగి ఉండేది. నిజంగా ఇది చర్చించాల్సిన అంశమే’ అన్నారు.