calender_icon.png 4 April, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగుడుకు బానిసైన కొడుకును చంపిన తల్లి

22-03-2025 02:07:03 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 21 (విజయక్రాంతి): తాగుడుకు బానిసై తరుచూ వేధింపులకు గురిచేస్తున్న కొడుకును కన్నతల్లి హతమార్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలో జరిగింది. ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపిన ప్రకారం ఎదురుగడ్డకు చెందిన రాజుకుమార్ (40) తాగుడుకు బానిసయ్యాడు. మత్తులో తల్లి, భార్య, కూతు  వేధించించేవాడు.

ఇతడి వేధింపులకు తాళలేక భార్య సుకన్య తన కూతురికి ఉరేసి తాను ఆత్మహత్యాయత్నానికిపాల్పడింది. సమయానికి సు  అత్త దూడమ్మ వారిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మనుమరాలు మా  మృతి చెందింది. కూతురి మృతితో కూడా రా  మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన తల్లి దూడమ్మ కుమారుడిని చంపాలనుకుంది.

రోజూలాగే రాజుకుమార్ గురు  రాత్రి మందు తాగి వచ్చి, మత్తులో పడుకున్నాడు. అదునుగా భావించిన తల్లి కొడుకు కాళ్లు, చేతులు కట్టేసి ఉరేసింది. ఈ విషయాన్ని కోడలు సుకన్యకు చెప్పడంతో ఆమె లక్ష్మిదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.