calender_icon.png 20 April, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్​డ్రింక్​లో ఎలుకల మందు కలిపి కుమార్తెను చంపిన తల్లి

20-04-2025 01:39:41 PM

హైదరాబాద్: కన్న కూతురుకు ఎలుకల మందు ఓ కసాయి తల్లి(Mother) చంపిన దారుణ సంఘటన హైదరాబాద్ బాచుపల్లి ప్రగతినగర్(Pragathi Nagar) లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల కుమారైను చంపి ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. అనారోగ్య సమస్యలతో(health problems) బాధపడుతున్న తల్లి కృష్ణపావని(32) నాలుగేళ్ల జశ్విక(04)కు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తాగించింది. 

తర్వాత తల్లి కృష్ణపావని కూడా విషం తాగి చనిపోయేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు తక్షణమే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్​లోని హాస్పిటల్​లో చికిత్స పొందుతూ పాప ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. తల్లి కృష్ణ పావని కూకట్​పల్లి ప్రసాద్ ఆస్పత్రి(Kukatpally Prasad Hospital) ఐసీయూలో చికిత్స పొందుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలో ఇటీవల జరిగిన చిన్నారుల హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.