21-03-2025 11:03:40 AM
లక్ష్మీదేవి పల్లె మండలంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మద్యానికి బానిసై తరచు తల్లిని వేధింపులకు గురి చేస్తుంటే భరించలేని ఆ తల్లి కన్న కొడుకుని హతమార్చిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri kothagudem) జిల్లా లక్ష్మీదేవి పల్లె మండలం ఎదురుగడ్డలో చోటు చేసుకోండి. ఎస్సై రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎదురుగడ్డకు చెందిన రాజుకుమార్ (40) మద్యానికి బానిసై నిత్యం భార్యా పిల్లలు తల్లిని వేధిస్తున్నాడు. బట్ట వేధింపులు భరించలేక భార్య సుకన్య కూతురికి ఉరివేసి తన తాను ఉరి వేసుకుంది.
సకాలంలో చూసి అత్త దూడమ్మ వారిని కాపా డే ప్రయత్నంలో కోడలు సుకన్యను కాపాడగలిగింది, మనవరాలు మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన కొడుకు రాజ్ కుమార్ లో ఎలాంటి మార్పు రాకపోగా బేధింపులు కొనసాగిస్తున్నాడు. అదే క్రమంలో గురువారం బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడి వేధిస్తున్న కొడుకును చంపాలని నిర్ణయించుకుంది తల్లి దూడమ్మ. మత్తు నిద్రలో ఉన్న కొడుకు కాళ్లు చేతులు కట్టేసి ఉరివేసి చంపింది. ఈ విషయం కోడలు సుకన్యకు చెప్పింది సుకన్య ఈ విషయాన్ని లక్ష్మీదేవి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. ఎస్ఐ రమణారెడ్డి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.