calender_icon.png 27 February, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపతో సహా బావిలో దూకిన తల్లి

27-02-2025 12:48:31 AM

వెంటనే బయటికి తీసిన స్థానికులు చిన్నారి మృతి.. తల్లికి తప్పిన ప్రాణాపాయం

జనగామ, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ పాప ప్రాణాలను బలి తీసుకుంది. భర్తతో గొడవ పడ్డ ఓ మహిళ క్షణికావేశంలో బిడ్డతో కలిసి బావిలో దూకగా.. చంటి బిడ్డ ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన జనగామ జిల్లాలోని గానుగుపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల రమేశ్, గౌరీ ప్రియ దంపతులకు శ్రీప్రగతి అనే రెండేళ్ల పాప ఉంది. భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో బుధవారం ఉదయం గొడవ జరిగింది.

ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దగా కావడంతో గౌరీప్రియ ఆవేశంలో తమ ఇంటికి దగ్గరలో ఉన్న బావిలో పాపతో కలిసి దూకింది. గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరిని బయటికి తీశారు. పాపను బతికించే ప్రయత్నం చేయగా అప్పటికే చిన్నారి ప్రాణాలు వదిలింది. గౌరీప్రియను జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.