calender_icon.png 27 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

27-11-2024 01:06:19 AM

కుటుంబ కలహాలే కారణం

వనపర్తి, నవంబర్ 26 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌కు చెందిన నిరంజన్, నసీఫా బేగం (35) భార్యభర్తలు. వీరికి హబీబ్ (7), సనా బేగం (5) ఇద్దరు పిల్లలు.

గత కొంతకాలంగా నిరంజన్, నసీఫా బేగం మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మరోసారి గొడవ జరగడంతో నసీఫా బేగం అదేరోజు సాయంత్రం తన పిల్లలతో సహా కనిపించకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం తాళ్ల చెరువులో ముగ్గురు విగత జీవులుగా తేలియాడుతూ కనిపించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.