calender_icon.png 24 January, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

24-01-2025 12:15:44 AM

ఖమ్మం, జనవరి 23 ( విజయక్రాంతి ): ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘట న ఖమ్మం జిల్లా  నిదానపురంలో గురువారం జరిగింది.  గ్రామానికి చెందిన షేక్ బాజీ ఎనిమిదేళ్ల కింద షేక్ పైజా (చిలివేరు మౌనిక)ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

వారికి మెహక్ (4), మెనురూల్ (3) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాగా షేక్ బాజీ తొలుత ఖ మ్మంలో నివాసం ఉండి, అనంతరం మళ్లీ నిదానపురం వచ్చి నివాసం ఉం టున్నాడు. తాజగా బోనకల్ మండలం మోటమర్రిలో బాజీని అనుమానంపై ఖమ్మం పోలీసులు పట్టుకుని వెళ్లారు.

దీంతో పైజా మనస్తాపం చెంది తన భర్త ఇక మారడనే మానసికాందోళనతో ఇద్దరు పిల్లలుతో సహా తను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో బాజీ విజయవాడకు సంబంధించిన ఒక  కేసులో కూడా నిందితు డిగా ఉన్నట్లు స్ధానికులు తెలిపారు.