calender_icon.png 18 November, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

29-06-2024 01:43:41 AM

రాజేంద్రనగర్, జూన్ 28(విజయ క్రాంతి): కుటుంబ కలహాల నేపథ్యం లో ఓ మహిళ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సోమశేఖర్, ప్రి యాంక(26) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు అద్విక్(3), ఆరాధ్య(7 నెలలు). వీరు కొద్దిరోజుల క్రితం  శంషాబాద్ ఆర్‌బీ నగర్ కాలనీకి వచ్చారు. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఇంట్లో కలహాలు ఉన్నాయి. శుక్రవారం భర్త బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఉరివేసుకుని భార్య విగత జీవిగా కనిపిం చిం ది. పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి, వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించాడు. పోలీసులు ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.