calender_icon.png 29 November, 2024 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకు చదవడం లేదని..తల్లి ఆత్మహత్య

06-11-2024 02:30:50 AM

కూకట్‌పల్లి, నవంబర్ 5: కన్న కొడుకు చదవకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్‌లోని రాజు కాలనీలో.. ఉమామహేశ్వర్, పుష్పలత (39) దంపతులు నివాసం ఉంటున్నారు. పుష్పలత ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గృహ నిర్వాహకురాలిగా పనిచేస్తుంది. వీరికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రెండో కుమారుడు సరిగ్గా చదవకపోవడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కుమారుడు తల్లి మాటలు వినకుండా జులాయ్‌గా తిరుగుతూ ఉండేవాడు. కొడుకు చదువులో వెనకబడటంతో పాటు ఆర్థిక సమస్యలు తీవ్రం కావడంతో పుష్పలత సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.