18-04-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 17: భర్తపై కోపం, మానసిక ఒత్తిడితో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపి, ఆ తర్వాత భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసు కుంది. గాజులరామారం బాలాజీ లేఔట్ సహస్ర మహేష్ హైట్స్ అనే అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో తేజ(35) అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలు హర్షిత్‌రెడ్డి (11), ఆశిష్‌రెడ్డి(9)తో కలిసి ఉంటోంది.
ఈ క్ర మంలో ఆదివారం సాయంత్రం కొ బ్బరిబోండా కత్తితో ఇద్దరి పిల్లలను నరికి, అనంతరం అపార్ట్‌మెంట్ భవ నం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలంలోనే హర్షిత్‌రెడ్డి మృతి చెందినట్లు గుర్తించారు. ఆశిష్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించగా, చి కిత్స పొందుతూ మృతి చెందాడు. జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందడంతో, ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఏసీపీ బాలానగర్, డీసీపీ బాలానగర్ ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటన స్థలంలో తేజ రాసిన ఆరుపేజీల సూసైడ్ నోట్ లభ్యమైం ది. అందులో ఆమె తన భర్తపై కొంత కోపంగా ఉన్నట్టు, అలాగే మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు రాసి ఉంది. ఆమె తన కంటికి సం బంధించి ఆరోగ్య సమస్యలతో పా టు పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ని ర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.