calender_icon.png 18 April, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో విషాదం

10-04-2025 08:40:49 AM

మూడేళ్ల పాపను చంపి ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా(Peddapalli district)లోని టీచర్స్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కుమారై వితన్యరెడ్డిని చంపి తల్లి సాహితీ ఆత్మహత్య చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని చంపి ఫ్యానుకు ఉరేసుకుని తల్లి ప్రాణాలు తీసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. సాహితీ భర్త వేణు ఎల్ఐసీ(Life insurance corporation)లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు  చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.