calender_icon.png 22 April, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

22-04-2025 01:49:20 AM

  1. చెక్‌డ్యాంలో దూకిన తల్లి

చిన్నారుల మృతి

తల్లిని కాపాడిన స్థానికులు

మెదక్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చిన్నారులిద్దరూ మృతిచెందారు. తల్లిని స్థానికులు కాపాడారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో సోమవారం జరిగింది. మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వడ్డెపల్లి మమత భర్త ఇటీవల మరణించాడు.

ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5) ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పిల్లల పోషణ కష్టంగా మారడంతో బతుకుపై విరక్తి చెంది, తన ఇద్దరు పిల్లలతో కలిసి తూప్రాన్‌లోని హల్దీవాగు చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది.

గమనించిన స్థానికులు తల్లిని బయటకు లాగగా, పిల్లలు మాత్రం మృత్యువాతపడ్డారు. తనకండ్ల ముందే ఇద్దరు పిల్లల శవాలను చూసి ఆ తల్లి రోధన అరణ్యరోధనగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.