calender_icon.png 22 April, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి ఇద్దరు పిల్లలకు గిన్నీస్‌బుక్‌లో చోటు

22-04-2025 12:59:36 AM

ఒకే కుటుంబానికి అరుదైన ఘనత

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులు పాల్గొన్న కార్యక్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ లో నివాసం ఉంటున్న మేడిది లలితకుమా రి, తన ఇద్దరు పిల్లలు లీషాప్రజ్ఞ(8), అభిజ్ఞ(5)లతో కలసి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు.

అతి చి న్న వయసులో ఈ రికార్డు నెలకొల్పినందుకుగాను తెలంగాణ అసెం బ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నారులను, తల్లితండ్రులను సోమవారం అభినందించారు. డిసెం బర్ 1, 2024న గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికారుడ సృష్టించడానికి హాల్లేల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోలను అప్లోడ్ చేయగా, లండన్‌లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలనుగా ప్రకటించి, డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని మణికొండలో గిన్నిస్ వరల్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు.