calender_icon.png 25 March, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి

23-03-2025 02:01:15 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట-ఖమ్మం జాతీయ రహదారిపై  గాంధీ నగర్ సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా వున్నాయి. ఆంధ్రా లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముస్టికుంట గ్రామానికి చెందిన సరస్వతి (70), కృష్ణ (53) అనే తల్లి కొడుకులు అశ్వారావుపేట మండలం నారాంవారి గూడెంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళుతుండగా దమ్మపేట మండలం గాంధీ నగర్  సమీపంలో వీరి ద్వీ చక్ర వాహనాన్ని ఎదురుగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో తల్లి కొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని దమపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి పరిశీలించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమ్మితం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.