calender_icon.png 20 April, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

16-04-2025 02:03:18 AM

చిలుకూరు,ఏప్రిల్ 15;  బావిలో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలుకూరు మండలంలోని కొత్త కొండాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుడిగం వీరమ్మ (70)కు దివ్యాంగ కుమారుడు నాగేశ్వరరావు (44) ఉన్నాడు. దివ్యాంగ కుమారుడి బాగోగులను వీరమ్మ స్వయంగా చూసుకుంటుంది. గత కొంతకాలంగా వీరమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నది.

తనకు ఏమైనా జరిగితే దివ్యాంగ కుమారుడు నాగేశ్వరరావు బాగోగులు చూసేవారు ఉండరనే ఆందోళనతో ఇద్దరు కలిసి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన తర్వాత గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్త్స్ర సురభి రాంబాబు మృతదేహాలను పరిశీలించి పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.