calender_icon.png 14 January, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఘునాథపాలెంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతిపై వీడిన మిస్టరీ

14-07-2024 06:26:09 PM

రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. బాబోజి తండాకు చెందిన డా. ప్రవీణ్ కుమారే భార్య కుమారి(25), కూతుర్తెలు కృషిక (4), తనిష్క(3)లను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. మే 28వ తేదీన ప్రవీణ్ తన భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి మంచుకొండ నుంచి హర్యాతండాకు వెళ్తుండగా దారి మధ్యలో అకస్మాత్తుగా ఓ కుక్క అడ్డుగా వచ్చిందని, దానిని తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టింది. రఘునాథపాలెంలో కారును చెట్టుకు ఢీకోన్నడంతో భార్య తన కూతుర్లు మరణించినట్లు ప్రవీణ్ తెలిపాడు. దీంతో పోలీసులు మే 29న రఘునాథపాలెం పీఎస్ లో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన 45 రోజులు తర్వత పోస్టుమార్టం నివేదికలో భార్యకు ఇంజక్షన్ విషమిచ్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. దీనిని ప్రవీణ్ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తేల్చి చెప్పారు.