calender_icon.png 26 April, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లీకూతురు అదృశ్యం

26-04-2025 12:00:00 AM

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనా

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ఇంట్లో నుంచి తల్లీకూతురు అదృశ్యమైన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు... నాగోల్ డివి జన్ బండ్లగూడలోని ఆనంద్ నగర్‌లో తుమ్మల కృష్ణయ్య(37) భార్యా వింధ్య(36), కుమార్తె హాస్య(6)తో కలిసి నివసిస్తున్నారు.

అయితే, గురువా రం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వింధ్య తన కూతురు ని తీసు కుని బయటకు వెళ్లింది. సమాచారం తెలుసుకున్న భర్త పలుచోట్ల వెదికినా ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయంలో శ్రీకాంత్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యానాయక్ తెలిపారు.