calender_icon.png 10 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి

09-01-2025 12:11:15 AM

మహేశ్వరం, జనవరి 8 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన పహాడి షరీఫ్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మరాసిపల్లికి చిత్తారి గోపాల్ తన కూతురు విజయ(14)కు అనారోగ్యంగా ఉండటంతో బుధవారం మధ్యాహ్నం భార్య లక్ష్మమ్మ(32)తో కలిసి బైక్  ఉస్మానియా హాస్పిటల్‌కు బయలుదేరాడు.

మార్గమధ్య  ఔటర్ రింగ్ రోడ్ వద్ద వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో తల్లీ కూతరు లక్ష్మమ్మ, విజయ అక్కడికక్కడే చనిపోగా, గోపాల్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. గోపాల్‌కు ఉస్మానియాలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.