పాలమూరులో విషాదం
జడ్చర్ల, డిసెంబర్ 21: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని పోమాల్ పెద్ద చెరువులో శనివారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. పోమాల్ గ్రామానికి చెందిన కుక్కింద సరోజ (25) తన నలుగురు సంతానంలో ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని శనివారం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా ఆమె పిల్లలు మిల్కీ, తేజ, కన్న ముగ్గురు ఆడుకుంటూ వెళ్లి చెరువులో మునిగిపోయారు. గమనించిన సరోజ వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించి ఆమె కూడా నీటిలో మునిగిపోయింది. నలుగురిలో తేజ నీటి నుంచి బయటపడగా తల్లి సరోజ, మిల్కీ, కన్న నీటిలో మునిగి మృతి చెందారు.