calender_icon.png 15 March, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

15-03-2025 06:04:08 PM

మోతే (విజయక్రాంతి): మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని బిక్య తండాలో రైతులు ఆరుగాలం శ్రమించి,అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి, పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మానసిక  వేదనతో, దిక్కుతోచని పరిస్థితులల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా యాసంగి సీజన్ ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులు నేడు నష్ట పోయారని అన్నారు. మోతే మండలంలో అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందనిఅన్నారు.

అధికారులు యుద్ధప్రాతిపదికన మోతే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బానోత్ లచ్చిరాం నాయక్, చర్లపల్లి మల్లయ్య, జంపాల స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.