calender_icon.png 1 March, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు తమ హక్కులు సాధించుకోవాలి: కందుకూరి యాదగిరి

01-03-2025 05:37:29 PM

మోతే: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా నడుస్తున్న మీడియా పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని మోతే మండల అభివృద్ధి అధికారి ఆంజనేయులు, ఎస్ఐ యాదవేందర్ రెడ్డిలు అన్నారు. శనివారం మోతే మండల ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి(Telangana State Journalists Association Founder President Kandukuri Yadagiri) మాట్లాడుతూ అహర్నిశలు ప్రజా సమస్యల కై కృషి చేస్తున్న జర్నలిస్టులు కలిసి తమ హక్కులు సాధించుకోవాలని యూనియన్లకు అతీతంగా అందరూ ఒక్కటిగా నడవాలని పిలుపునిచ్చారు. మోతే మండల జర్నలిస్టు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా అనతి కాలంలోనే క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకోవడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గటిగుండ్ల రాము రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకల చిరంజీవి మోతే మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్పుల సాయికృష్ణ,ఉపాధ్యక్షుడు కోటి నాయక్,కోశాధికారి గురజాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.