calender_icon.png 21 February, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్లు అరెస్ట్

16-02-2025 12:44:57 AM

* పలు కేసుల్లో నిందితులుగా ఉన్న హబీబ్ తాల్‌హా, ఆనంద్ అగర్వాల్

* పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం 

చార్మినార్, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ రౌడిషీ టర్లను సౌత్, ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చంద్రాయణగుట్ట పరిధిలో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడిషీటర్‌గా ఉన్న హాబీబ్ తల్‌హా బిన్ అబ్దుల్ ఖాదీర్ అలియాస్ హాబీబ్ తల్‌హా(27)పై పలు పోలీస్ స్టేషన్‌లలో 18 కేసులు ఉన్నాయి.

అలాగే చంచల్‌గూడకు చెందిన కే ఆనంద్ అగర్వాల్ (28)పై మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్నాడు. ఇత డిపై 11 కేసులు ఉన్నాయి. కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరూ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. విశ్వసనీ య సమాచారంతో శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు