calender_icon.png 24 October, 2024 | 6:52 AM

మోస్ట్ వాటెండ్ క్రిమినల్ ఆయూబ్‌ఖాన్ అరెస్ట్

24-10-2024 02:54:04 AM

  1. 14 మర్డర్ కేసులతో పాటు 72 కేసుల్లో హస్తం
  2. జ్యూడీషియల్ కస్టడీకి తరలించిన పోలీసులు

చార్మినార్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పాతబస్తీలో మో స్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆయూబ్ ఖాన్ పోలీసులకు చిక్కాడు.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిష నరేట్ల పరిధిలో నిందితుడిపై ఇప్పటికే 72 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలు జీవితం గడిపిన ఆయూబ్‌ఖాన్ ఆ తర్వాత బెయిల్‌పై బయట కు వచ్చి పోలీసులకు చిక్కకుండా త ప్పించుకుని తిరుగుతున్నాడు.

పాతబస్తీ ఫతే దర్వాజ కుమ్మరివాడి ప్రాం తానికి చెందిన మహ్మద్ ఆయూబ్‌ఖాన్ అలియాస్ ఆయూబ్ అలియాస్ పఠాన్ (54) నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడ్డా డు. వీటిలో 14 హత్యా కేసులు, 14 హ త్యాయత్నం కేసులు, ఆయుధ చట్టాల ఉల్లంఘన, భూకబ్జాలు, కిడ్నాప్ కేసు లు ఉన్నాయి.

విశ్వసనీయ సమాచా రం మేరకు కమిషనర్ టాస్క్‌ఫోర్స్ సౌత్‌జోన్ పోలీసులు, కామటిపుర పో లీసులు సంయుక్తంగా దాడి చేసి బుధవారం ఆయూబ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కామటిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు నిందితుడిని జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.