16-03-2025 01:40:41 AM
ప్రముఖ సర్జన్ రఘురామ్ ఆధ్వర్యంలో నిర్వహణ
సేవలను కొనియాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాం తి): హైదరాబాద్‌కు చెందిన ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ -ఉషాలక్ష్మిసెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్.. బ్రహ్మకుమారీలతో కలిపి రొమ్ము క్యాన్సర్‌పై నిర్వహించిన ఎవేర్‌నెస్ డ్రైవ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 24 గంటల్లోనే అత్యధిక వ్యూ స్ లభించాయి. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే రెండో గిన్నిస్ ప్రపంచరికార్డు సొంతం చేసుకోవడం విశేషం. గిన్నిస్ వరల్ రికార్డ్ (జీడబ్ల్యూఆర్) ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ జడ్జి రిషినాథ్ నేతృత్వంలో కిమ్స్ ఆస్ప త్రిలో నిర్వహించిన డ్రైవ్‌లో ప్రముఖ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రఘురామ్ 40 నిమిషాలకు పైగా స్పష్టమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.
రొమ్ము క్యాన్సర్‌లో ఉండే వివిధ అంశాల గురించి సులభంగా అర్థం చేసుకునేలా రికార్డు స్థాయిలో డాక్టర్ రఘురాం అవగాహన కల్పించారు. మొత్తం గా 24 గంటల్లోనే 11 వేల మందికి పైగా ఈ మెగా ఎవేర్‌నెస్ డ్రైవ్ ద్వారా లబ్ధి పొందా రు. గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రజంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రముఖ సర్జన్ డాక్టర్ పీ రఘురామ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 గంటల్లో 11 వేలమందికి రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్ నుంచి రెండు రికార్డులు సాధించడం అభినందనీయన్నారు.
డాక్టర్ రఘురా మ్ గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలందిస్తున్నారన్నారు. దాదాపు 4000 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తుచేశారు. డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ ఈ రికార్డును తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మికి అంకితమి స్తున్నట్టు చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆమే స్ఫూర్తిగా నిలిచినట్టు వివరించారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బీ భాస్కరరావు మాట్లాడుతూ డాక్టర్ రఘురామ్ తన కెరీర్‌లో మరో మైలురాయిని సాధించడం అభినందనీయమని కొనియాడారు. డాక్టర్ రఘురామ్‌ను ఆస్కి చైర్మన్ కే పద్మనాభయ్య అభినందించారు.