calender_icon.png 11 February, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత పారదర్శకంగా కులగణన

10-02-2025 12:44:17 AM

  1. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు
  2. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణలో కుల గణన సర్వే అత్యంత పారదర్శకం గా జరిగిందని, కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీకులగణనను తప్పుపడుతున్నారని పీపీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  మండిపడ్డారు. ఎంతో శాస్త్రీయం గా లక్షకు పైగా సిబ్బందిని నియమించి ఇంటింటికి వెళ్లి కులగణన చేపట్టామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుం దని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లే..

రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి సహకరిస్తోందన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటివరకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించలేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినట్టుగానే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సున్నా వస్తుందని బీఆర్‌ఎస్ భయపడుతోందన్నారు.