కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్
ముషీరాబాద్, జూలై 13: జీహెచ్‌ఎంసీ జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని జవహర్‌నగర్‌లో రూ.50 లక్షలతో నూతన స్టామ్ వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పను లు, కవాడిగూడ డివిజన్‌లోని దోమలగూడ జీహెచ్ ఎంపీ పార్కులో ఓపెన్ జిమ్ అభివృద్ధి పనులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, ముఠా గోపాల్ మాట్లాడుతూ.. జల మండలిలో నిధుల కొరతతో అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తేలికపాటి వర్షా నికే లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలమండలికి ఎక్కువ నిధులిచ్చి, హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పావనీవినయ్‌కుమార్, గోడ్చల రయనశ్రీ, జీహెచ్‌ఎంసీ డీఈ గీత పాల్గొన్నారు.