సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర
సంగారెడ్డి (విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సూచించారు. శనివారం సంగారెడ్డి కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా లోక అదాలత్ నిర్వహించి పెండింగ్ కేసులు పరిష్కారం చేస్తారన్నారు. క్రిమినల్ కేసులు పాండవులు కేసులు పౌండబుల్ కేసులు ఎక్సైజ్ కేసులు రాజీమార్గంలో పరిష్కారం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రమేష్, సంగారెడ్డి అదనపు ఎస్పి సంజీవరావు, న్యాయమూర్తులు ప్రభుత్వ న్యాయవాదులు పాల్గొన్నారు