calender_icon.png 5 November, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోనే అత్యంత అవినీతి

31-08-2024 03:53:07 PM

చిల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు 

 ప్రాజెక్టులపై అవగాహన ఉన్న కడియం శ్రీహరి మంత్రులతో ఎందుకు మాట్లాడలేదు 

తీవ్రంగా విమర్శించిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ: కాంగ్రెస్ హయంలోనే అత్యంత అవినీతి జరిగిందని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రుల బృందం శుక్రవారం రోజున దేవాదుల ప్రాజెక్టును సందర్శించడం జరిగిందని,ఈ సందర్భంగా వారు ప్రాజెక్టుపై ఎటువంటి అధ్యయనం చేయకుండా చిల్లర మాటలు, చిల్లర చేస్టలు చేస్తూ ఉన్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండగా అయితే కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ పండుగలా చేశాడని అన్నారు.అనేక ప్రాజెక్టులు, చెరువులను నీళ్లు నింపి  ఆరున్నర లక్షల ఎకరాలకు దేవాదుల ద్వారా నీటిని అందించాడని అన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంలోనూ,ప్రతి విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారని  ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్యాగాల పునాదులపై ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో  రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు.2003 ఎన్నికల్లో హడావిడిగా తెలంగాణ రాష్ట్రంలో హుటాహుటిన తాపీ మేస్త్రి,అందరినీ  ఓకే హెలికాప్టర్ లో తీసుకొని వచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పునాది వేయించాడని, అప్పటినుండి  2014 వరకు ఎటువంటి పనులు జరగలేదని అన్నారు.2008లో ప్రాజెక్టుకు నాలుగువేల కోట్లు ఉంటే కాంగ్రెస్ హయాంలో 10,000 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. అప్పటి టిడిపి, మొన్నటి బిఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ లో కడియం శ్రీహరి ఉండి, కెసిఆర్ అపర భగీరథుడని ఒక కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినటువంటి ఘనత కేసిఆర్ కు దక్కుతుందని కడియం శ్రీహరి అన్నారని తెలిపారు. అంతేకాకుండా రూ.2100 కోట్లతో 2017 లో శంకుస్థాపన చేసి 2022లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు.

100 టీ ఎం సి ల నీటిని దేవాదులకు కేటాయించడం హర్షనీయమని,ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు  సాగునీరు అందుతుందని కడియం శ్రీహరి అన్నారని ఆ విషయాన్ని మీడియా ముఖంగా తను మాట్లాడిన వీడియోను చూపించారు. ఉత్తంకుమార్ రెడ్డి ఉత్త మాటలే చెప్తున్నారని, ఆయన పక్కన ఉండి కూడా కడియం శ్రీహరి మాట కూడా మాట్లాడలేదని  అన్నారు. ప్రాజెక్టులపై అవగాహన ఉన్నటువంటి కడియం శ్రీహరి పార్టీలు మారొచ్చు కానీ,మాట మార్చవద్దని హితవు పలికారు. రైతన్నను రాజు చేయాలని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద కాలేశ్వరం ప్రాజెక్టును  నిర్మించి,అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం అందించినటువంటి ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు. రైతు వేదిక, రైతుబంధు,రైతు బీమా అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను నియమించి రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు.అమలు కానీ 420 హామీలు,ఆరు గ్యారెంటీల తో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో అసహనం పెరిగిందని వారి ఎమ్మెల్యేలను ఎక్కడికి అక్కడ నిలదీస్తున్నారని, అందుకే ఒక నెల ఫోన్ టాంపరింగ్ అని,ఒక నెల మేడిగడ్డ అని, ఒక నెల దేవాదుల ప్రాజెక్టు అని డ్రామాలాడుతున్నారని అన్నారు.సకాలంలో రుణమాఫీ చేయక,సకాలంలో  రైతు భరోసా ఇవ్వక ఎరువులు,విత్తనాలు కూడా సకాలంలో అందించినటువంటి దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

సిగ్గు,శరం ఉంటే రాజీనామా చెయ్

మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ...

 వ్యవసాయం రంగం మీద, వ్యవసాయం మీద ఎటువంటి అవగాహన లేని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడడం  సరికాదన్నారు. అనేక ప్రాజెక్టుల తో సస్యశ్యామలం చేసి, పంజాబ్, హర్యానా రాష్ట్రల వలె మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం,కేసిఆర్ ఆధ్వర్యంలో రైతులు  పండించడం జరిగిందని అన్నారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించే దిశగా ప్రయత్నం చేశారని అన్నారు.రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఐక్యరాజ్యసమితి అభినందించిందని ఈ సందర్భంగా తెలిపారు. కడియం శ్రీహరి మరియు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి   సిగ్గు,శరం లేకుండా అవగాహన లేకుండా మాట్లాడుతుండడం సిగ్గుచేటని అన్నారు. మా ప్రభుత్వ హాయంలో  ఇరిగేషన్ మీద ఏప్రిల్, మే నెలల్లోనే  రివ్యూ చేసేవాళ్లమని, ఒక పంట అయిపోయినా కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది..కరువు వచ్చింది అని అన్నారు.

కడియం శ్రీహరి ఏ గొండకు ఆ గొడుగు పడతాడని,2003లో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం లేట్ అవుతుందనే ఉద్దేశంతో 2003లోనే పిండాలు పెట్టానని, ఆ తరువాత ఇరివేషన్ ప్రాజెక్టు  గేట్లు ఎత్తడానికి అప్పటి మంత్రి వస్తే తాలాన్ని తీసుకొని చెరువులో పడేసాడని అన్నారు.కడియం శ్రీహరి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబుకు,కేసిఆర్ కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరాడని అన్నారు.2022లోనే అయిపోయేటువంటి ప్రాజెక్టును కూడా అడ్డుకున్నది కడియం శ్రీహరి అని అన్నారు. దాని పనుల కోసం తను, పల్లా రాజేశ్వర్ రెడ్డి కెసిఆర్ ను కలవగా రూ.134 కోట్లు అదనంగా కేటాయించాడని  అన్నారు.శ్రీహరి ఇప్పటివరకు రిజర్వాయర్ ను సందర్శించిన పాపాన పోలేదని,ఎన్ని పంపులు ఉన్నాయో తెలవదని అన్నారు. 100 పడకల హాస్పిటల్ రూ.37. 50 కోట్ల అభివృద్ధి పనులను తీసుకొస్తే దాన్ని కూడా  ఆపించారని అన్నారు.దిగజారుడు రాజకీయాలు మానుకొవాలని అన్నారు.బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారుల కష్టంతో గెలిచిన నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఉకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేయమని అన్నారు. పోయే కాలానికి దగ్గరగా ఉన్నావని ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని కోరారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. 

శుక్రవారం రోజున సగం క్యాబినెట్ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వ హాయంలో దేవాదుల ప్రాజెక్టును 90% పూర్తిచేసిన  ప్రాజెక్టుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.ఎస్సారెస్పీ పనితోపాటు జలయజ్ఞం డబ్బులను కూడా కాంగ్రెస్ పార్టీ దొంగల వలె కాంట్రాక్టర్లకు అప్పగించిందని,  కెసిఆర్ ప్రభుత్వం వాటిని రద్దుచేసి తిరిగి రీటెండర్ ను పిలిపించి ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి ఘనత బి ఆర్ ఎస్ పార్టీదే అన్నారు.గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది.గ్రౌండ్ వాటర్ ఏవిధంగా పెరిగింది అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని అన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి అప్పుడు మంత్రిగా పనిచేసి వందల కోట్లు దోచుకున్నాడని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై లో కొన్ని వందల కోట్ల కుంభకోణంను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేశాడని అన్నారు.తనకు జైలు తప్పదని,కెసిఆర్ ను తిడితే కుంభకోణం దాగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరికి పడడం లేదని, ఇలా తిట్టడం వల్ల మీకు పార్టీ ఏదో న్యాయం చేస్తుంది అనుకుంటే మీ పొరపాటే అని అన్నారు. మీకు,మీ సహచర మంత్రివర్గానికి,మీకు, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి పొసగడం లేదని అన్నారు.

మేడిగడ్డ పైన కమిషన్ విచారణ జరుగుతుందని దానిపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.ప్రాజెక్టు పైన రిపోర్టు రాలేదని, రోడ్డు రోమియో లాగా మాట్లాడడం ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని  లేకపోతే వరంగల్ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే సివిల్ సప్లై లో కుంభకోణం గురించి ఆధారాలతో కూడిన ఫైల్ ను, ప్రతి నెల  1100 కోట్ల రూపాయలు నీ అనుచరులైనటువంటి టెండర్స్ లో పాల్గొన్నటువంటి వారికి,ఏ బ్యాంకులో జమవుతున్నాయో మాకు తెలుసు అని అన్నారు.ధాన్యాన్ని క్వింటాలుకు  రూ.2007 లకు రైతుల దగ్గర తీసుకొని, రూ.2230లను ప్రభుత్వం ఇస్తున్నట్టు చెబుతున్నారని, అందువల్ల ఈ డబ్బులు ఎటు పోతున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు.మీరు ఒక పెద్ద డేకాయిట్ అని ఏద్దెవా చేశారు.ఇప్పటివరకు ప్రభుత్వానికి స్పందనలేదని రిజిస్టర్ పోస్టు ద్వారా, మెయిల్ ద్వారా కంప్లైంట్ చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే హైకోర్టులో కూడా పిల్ వేశానని,మీ కుంభకోణం త్వరలోనే బయటపడుతుందని, ఉత్తంకుమార్ రెడ్డి నోరు మూసీ నది కంటే ఘోరంగా ఉందని అన్నారు. వరంగల్లో 12 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పని చేసానని, పోరాటాల గడ్డ వరంగల్ అని దీన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1270 చెరువులు జూన్ చివర్లో గాని,జూలై ఫస్ట్ వీక్ లో గాని నిండు కుండాల కనిపించేవని,ఇప్పుడు అవి కనబడటం లేవని అన్నారు. అదేవిధంగా 16.5 టీఎంసీల నీళ్లు నింపే వాళ్లమని అన్నారు. దేవాదుల ఫేస్ వన్, టూ, త్రీ,ఫోర్..ఈ విధంగా మేము నీళ్లను నింపే వాళ్ళమని, ఇంకా 6 పంపులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని కానీ, మంత్రికి ఇతరులకు చెప్పినా కూడా నీటిని ఎత్తిపోయేసేందుకు అనుమతి ఇవ్వలేని దద్దమ్మ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అని అన్నారు.

ప్రజా పాలన కాదు...  ప్రజలను హింసించే పాలన

మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ 

ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని కానీ కాంగ్రెస్ పాలన లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇది ప్రజా పాలన  కాదని, ప్రజలను హింసించే పాలనా అని అన్నారు. రైతులకు ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోలేక అసహనం వ్యక్తం చేస్తూ రైతుల పై కక్ష చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, హసన్పర్తి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండి రజనీ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీమ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, శ్రవణ్ కుమార్,విజిలెన్స్ కమిటీ మాజీ సభ్యులు పోలేపల్లి రామ్మూర్తి,పదవ డివిజన్ అధ్యక్షులు ఖలీల్, 29వ డివిజన్ అధ్యక్షులు సదాంత్, రవీందర్ రావు, వీరస్వామి  తోపాటు తదితరులు పాల్గొన్నారు.