calender_icon.png 25 October, 2024 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతివల అందానికి!

28-05-2024 12:05:00 AM

అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలంటే ఇష్టపడని ఆడవాళ్లుం టారా? అందులోనూ ఈ తరం అమ్మాయిలు ఫ్యాషన్ ప్రియులు. రాళ్లూ.. రత్నాలు.. బంగారం చెక్కుళ్లతో తీర్చిదిద్దిన హారాలూ, నెక్లెస్‌లూ.. ఇలా బీరువాలో ఎన్నున్నా కొత్తదనం కోసం వెతుకుతూనే ఉంటారు. ఈ విషయం తెలిసే డిజైనర్లు కూడా మహిళల్ని మెప్పించే డిజైన్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలెన్నో చేస్తుంటారు. పాతవాటికే మెరుగులద్ది నవ్యతను తెచ్చిపెడుతుంటారు. అలాంటివే ఈ సిల్వర్ కలర్ ఆభరణాలు. ఈ తరం అమ్మాయిలను మెప్పించి.. మురిపించడానికి వచ్చేశాయి. కాస్త జ్యూవెలరీ సైజ్ పెద్దగా ఉన్నా.. అమ్మాయిలు మాత్రం వీటిని వదిలిపెట్టడం లేదు. ఈ సిల్వర్ కలర్ నెక్లెస్‌లో.. కుందన్లు.. రాళ్లూ.. పెండెంట్లు తోడై.. మెడలో వేసుకోగానే మెరిసిపోతుంటాయి. అమ్మాయిలకు నిండుదనాన్ని తెచ్చి పెడతాయి. ఈ లెటెస్ట్ ఫ్యాషన్ జ్యూవెలరీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి..!