26-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో మలేరియా వ్యాధిని తగ్గించడంలో గణనీయమైన ప్రగతిని సాధించిందనీ తెలిపారు.
దోమల ద్వారా మలేరియా, ఫైలేరియాసిస్, డెంగీ, మెదడువాపు, చికెన్ గున్యా, జికా లాంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్ రెడ్డి , వైద్యాధికారి డాక్టర్ విరాజిత, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీహరి, ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, పురుషోత్తం, గీత, ఎంపీహెచ్‌ఇఓ కేఎల్‌ఎన్ స్వామి, గౌస్, సూపర్వైజర్లు ఫయిముద్దీన్, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.