calender_icon.png 27 April, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

27-04-2025 12:07:18 AM

పరుపుపై పడి, నిప్పంటుకుని పోగ చూరడంతో ఉపిరి ఆడక బాలుడి మృతి, బాలికకు అస్వస్థత

పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో విషాదం

ఎల్బీనగర్, ఏప్రిల్ 26 : దోమల నివారణకు ఇంట్లో వెలిగించిన మస్కిటో కాయిల్ పరుపుపై పడడంతో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడగా, బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలిక తీవ్రంగా గాయపడడంతో నీలోఫర్ దవాఖానకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు... పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని భువనేశ్వరి కాలనీలో అబ్దుల్ ఖాదర్ జిలానీ భార్య, నలు గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.  శనివారం రాత్రి సమయంలో దొమల నివార ణకు మస్కిటో కాయిల్ వెలిగించాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాం తంలో కాయిల్ పరుపుపై పడడంతో నిప్పంటుకుని, గది మొత్తం పోగతో నిండింది.

ఈ ప్రమాదంలో పరుపుపై పడుకున్న బాలుడు అబ్దుల్ రెహమాన్ (4) అక్కడికక్కడే మృతిచెందాడు. బాలిక ఆతిఫా (4) తీవ్రంగా గాయపడడంతో నీలోఫర్ దవాఖానకు తరలించారు. అబ్దుల్ ఖాదర్‌కు నలుగురు పిల్ల లు. వీరిలో ఇద్దరు కూతు ళ్లు, ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అర్హన్, పెద్ద కూతురు ఆఫియా హాల్ లో పడుకున్నారు. జిలానీ, భార్య  ఫౌజియ బేగం, చిన్న కుమారుడు అబ్దుల్ రెహమాన్, చిన్న కుమార్తె ఆతిఫా నలుగురు బెడ్ రూమ్‌లో పడుకున్నారు.

తెల్లవారుజామున మస్కి టో కాయిల్ పరుపుపై పడడంతో నిప్పంటుకుని గది మొత్తం పోగతో నిండిపోవడంతో రెహమాన్ అక్కడికక్కడే మృతిచెందగా, బాలిక తీవ్ర అస్వస్థత కు గురైంది. బాలికను వెంటనే నీలోఫర్ దవాఖానకు తరలించారు. సమాచారం తెలుసుకున్న హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.