calender_icon.png 19 April, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాకు కోరల్లో మోర్తాడ్ శ్మశాన వాటిక

19-04-2025 12:16:27 AM

  1. ఆక్రమణలో   మోర్తాడ్ లోని  శ్మశాన వాటిక  
  2. నాలుగు ఎకరాల స్థలం, అధిక భాగం కబ్జా
  3. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
  4. అధికారులు హద్దులు ఏర్పాటు చేయాలంటూన్నా  స్థానిక ప్రజలు
  5. సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని వైకుంఠధామ నిర్మాణ పనులు

మోర్తాడ్ ఏప్రిల్ 18:(విజయ క్రాంతి) బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్  మండల కేంద్రంలో నిర్మిస్తున్న స్మశాన వాటిక స్థలం కబ్జాకు గురవుతుందని స్మశానానికి సంబంధించిన భూమి సుమారు నాలుగు ఎకరాల వరకు ఉండేది,ఇప్పుడు చూస్తే సగం భూమిని అక్రమంగా కబ్జా చేశారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు గతంలో ఈ విషయమై  గ్రామంలోని వివిధ కుల సంఘాలతో స్మశాన వాటిక వద్ద సమావేశం ఏర్పాటు చేసి అప్పటి  తహసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా  దీంతో తహసిల్దార్ తో సహా రెవెన్యూ అధికారులు స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అలాగే వైకుంఠధామం నిర్మాణ పనులు సైతం  సుమారు నాలుగు ఏళ్లుగా అసంపూర్తిగా  నిలిచిపోయాయని  ఎస్సీ వాడ ప్రజలు వారి తోటలకు వెళ్లే రోడ్డుకు అనుకొని ఉన్న ఈ స్మశాన వాటిక గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు వినియోగించుకుంటున్నారు కాగా గత ప్రభుత్వ హాయంలో వైకుంఠధామం నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా 12 లక్షల 60 వేల రూపాయలు మంజూరయ్యాయి.

అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 2021 జనవరి 7 వ తేదీన  ఈ వైకుంఠ దామ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటినుండి నేటి వరకు దీని  నిర్మాణం పూర్తి కాలేదు మోర్తాడ్ గ్రామంలోని జనాభాలో ఎక్కువ భాగం ప్రజలు ఈ స్మశాన వాటికను వినియోగించుకుంటున్నారు.ఈ వైకుంఠధామంలో రెండు  దహన వాటికలు, కాటి కాపరి గది, స్మశానానికి వెళ్లే ప్రవేశ ద్వారం, పనులు కొద్ది శాతం మిగిలి ఉన్నాయి.

దహనవాటికలు పూర్తీ  కాకపోవడంతో బయటనే  శవ దహణాలు చేస్తున్నారు మహిళలకు, పురుషులకు, వేరు వేరుగా  స్నాన వాటికలు పూర్తయ్యాయితే స్మశానానికి వెళ్లి కంకర రోడ్డు గుంతలు పడి కంకర తేలి  అక్కడ వెళ్లడానికి ప్రజలకు అసౌకర్యంగా మారింది  అలాగే రెవెన్యూ అధికారులు భూమిని సమగ్రంగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుచున్నారు.