calender_icon.png 6 November, 2024 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్

06-11-2024 03:33:39 PM

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టినట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని 6,7,10 వార్డుల్లోని నార్లాపూర్, 6 రామకృష్ణాపూర్(వి), 3వ జోన్, దొరలబంగ్లా ఏరియాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల వాసులు వార్డుల్లోని డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

అనంతరం పట్టణంలోని లెదర్ పరిశ్రమను సందర్శించారు. లెదర్ పరిశ్రమకు సంబంధించిన భూమిని సోలార్ ప్లాంట్ కంపని నిర్వాహకులు ఆక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ ప్లాంట్ కంపనీ నిర్వాహకులు ఆక్రమించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. లెదర్ పరిశ్రమ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. లెదర్ పరిశ్రమ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి త్వరలోనే ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ సేన నాయకులు పాల్గొన్నారు.