calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత పారదర్శకంగా ప్రజావాణి

15-04-2025 01:22:45 AM

  1. సమర్థవంతమైన విధానాలు అమలుచేయాలి
  2. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
  3. ఇప్పటివరకు వచ్చిన 54,619 అర్జీల్లో 68.4శాతం పరిష్కారం

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమం విజయవం తంగా కొనసాగుతోందని, ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శ కమైన సమర్థవంతమైన విధానాలు అమలుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో వారంలో రెం డు రోజులు కొనసాగుతున్న ప్రజావాణిలో ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి..

అర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి శాంతికుమారి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతోపాటు వివిధ శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.

వివిధ విభాగా లకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్‌లతోపాటు గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. 

68.4 శాతం అర్జీలు పరిష్కారం..

2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, అందు లో 54,619 అర్జీలను ప్రజలు నమోదుచేసుకోగా వీటిలో 68.4శాతం(37,384) అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు సీఎం కు వివరించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాలను ప్రజాభవ న్‌లో జరిగే ప్రజావాణి డ్యాష్‌బోర్డ్‌తో అనుసంధానం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

దీంతో మండలస్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థా యిలో పరిష్కారమయ్యే అంశాలు వెంటనే పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్‌ను తనకు అందించాలని, సీఎంకు లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందన్నారు.

అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారుల కు దిశానిర్దేశం చేయడం వేగవంతమవుతుందన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతిని పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండే లా పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు.

ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం గోప్యంగా ఉంచే సమాచారాన్ని, ప్రజలకు అందుబాటులో ఉంచే అంశాలను ముందుగా సమీ క్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.