16-02-2025 12:44:59 AM
లక్నో, ఫిబ్రవరి 15: ప్రపంచలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగైన మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 50 కోట్ల మందికిపైగా భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఈ సంఖ్య భారత్, చైనా మినహా ప్రపంచంలో మిగిలిన దేశాల జనాభా కంటే కూడా ఎక్కువే.
ఈ రెండు దేశాల జనాభా మాత్రమే మహాకుంభమేళా లో పాల్గొన్న భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహాకుంభమేళా ప్రారంభం సందర్భంగా మొత్తం 45కోట్ల మంది భక్తులు ఇందులో పాల్గొంటారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంచనా వేశారు.
అయితే ఫిబ్రవరి 11 తేదీ నాటికే 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. మరో పది రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక పండుగ జరగనుండటంతో మహాకుంభమేళా ముగిసే నాటికి మొ త్తం 55 నుంచి 60 కోట్ల మంది భక్తు లు పవిత్ర స్నానాలు చేసే అవకాశం ఉంద ని అధికారులు అంచనా వేస్తున్నారు.
గడువు పొడగించాలి
మహాకుంభమేళా గుడువును పొడగించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. గతంలో కుంభమేళాను 75 రోజులపా టు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశా రు.
ప్రతి ఒక్కరూ మహాకుంభమేళాలో పాల్గొనాలనుకుంటున్నట్టు తెలిపిన అఖిలేశ్.. గడువు తక్కువ ఉండటం వల్ల మేళాలో పాల్గొనే అ వకాశాన్ని కోల్పోతున్నారని వెల్లడించారు. అందువల్ల కుంభమేళా గడువును పొడగించాలని ప్రభుత్వానికి సూచించారు.
మరోసారి అగ్నిప్రమాదం
మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. 18, 19 సెక్టార్లలో ఒక్కసా రిగా మంటలు చెలరేగి అనేక గుడారాలు దగ్ధమయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనలకు లోనయ్యారు.
అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువం టి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కా గా.. మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం చో టు చేసుకోవడం ఇది మూడోసారి.
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తోపులాట
కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు విపరీ తంగా రావడంతో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట పరిస్థితులు నెలకొన్నాయి. ప్లా ట్ ఫామ్ నెంబర్లు 13, 14 పైకి ప్రయాణికు లు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఈ పరిస్థి తి తలెత్తింది.
విపరీతమైన రద్దీ కారణంగా నలుగురు మహిళలు స్పృహ కోల్పోయా రు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించా రు. ఫైరింజన్లు, అంబులెన్సులు రైల్వేస్టేష న్‌కు చేరుకున్నాయి. 15 మందికి గాయాలై నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపు లోనే ఉందని రైల్వేశాఖ ప్రకటించింది.